Wednesday, November 11, 2015

अजरामरवत्प्राज्ञो विद्यामर्थ च साधयेत् ।
गृहीत इव केशेषु मृत्युना धर्ममाचरेत् ॥ 

అజరామరవత్ప్రాఙో విద్యామర్థ చ సాధయేత్
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్


ప్రాఙులు తమను తాము అజరామరులు అన్నట్లు విద్యార్జన, ధనార్జన నిరంతరం చేస్తూనే వుంటారు. అదే ధర్మాచరణ విషయానికొస్తే వెంట్రుకవాసిలో  మృత్యువు వుంటే ఎలా వుంటారో అంత జాగ్రత్తగా ధర్మాచరణ చేస్తారట.

Tuesday, November 10, 2015

पुस्तकेषु च या विद्या परहस्ते च यत् धनम। 
समये तु परिप्राप्ते न सा विद्या न तत् धनम।। 

పుస్తకేషు చ యా విద్యా పరహస్తే చ యత్ ధనం ।
సమయే తు పరిప్రాప్తే న సా విద్యా న తత్ ధనం ।।

పుస్తక పరిమితమైన జ్ఞానం, పరహస్తమైన ధనం వలన ఉపయోగం శూన్యం. ఇక్కడ సుభాషిత కారుని అభిప్రాయం పుస్తకాల నుండి పొందిన జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ఆచరణలోనికి తీసుకురాకపోయినా మరియు ఇతరుల అవసరానికి ఇచ్చిన ధనం మన అవసరానికి తిరిగి ఇవ్వకపోయినా అటువంటి సంపద నిరుపయోగం.

Saturday, November 7, 2015

सत्यम ब्रूयात प्रियं ब्रूयात न ब्रूयात सत्यम अप्रियम
प्रियंच नानृतम ब्रूयात एषा धर्मः सनातनः

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం 
ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః

శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణునికి సత్యాన్ని ఏ విధంగా చెప్పాలో పై శ్లోకం ద్వారా వివరించడం జరిగింది. 

సత్యాన్ని చెప్పడం మన ధర్మం, కాని అది తప్పక ఎదుటివారికి ప్రియంగా ఉండాలి. అప్రియమైన సత్యాన్ని వచించకపోవడం ఉత్తమం. మరియు ఎదుటి వారికి ప్రియమైనను అసత్యాన్ని చెప్పకూడదు. ఇదే సనాతన ధర్మంలో మోక్ష మార్గానికి దారి.

Tuesday, November 3, 2015

धर्मो जयति नाधर्मः सत्यं जयति नानृतं
क्षमा जयति न क्रोधो  विष्णुर्जयति नासुरः

“ధర్మో జయతి నాధర్మః సత్యం జయతి నానృతం 
క్షమా జయతి న క్రోధో విష్ణుర్జయతి నాసురః "

“ధర్మమే జయిస్తుంది, అధర్మం కాదు. సత్యం జయిస్తుంది, అసత్యం కాదు. క్షమ జయిస్తుంది, క్రోధం కాదు, విష్ణువు జయిస్తాడు, రాక్షసుడు కాదు " అని ఈ శ్లోకానికి భావం.
“సత్యం వద, ధర్మం చర"అనే ఆదర్శాన్ని ఉపనిషద్వాణి మనకు అందించింది. భారతీయ పురాణేతి హాసాలలో ఈ ఆదర్శంకోసం నిలబడి తరించిన మహనీయుల చరిత్రలు మనకు సుపరిచితాలు. శ్రీరాముణ్ణి మారీచుడు “రామో విగ్రహవాన్ ధర్మః" అన్నాడు. రాముని ధర్మాచరణదీక్ష అమోఘ మైనది. దైవం ధర్మ స్వరూపుడు, ధర్మ ప్రియుడు. అందుకే-ధర్మగ్లాని సంభవించినపుడు“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే"అన్నాడు భగవద్గీతలో. దైవ బలం కలది కనుక ఎప్పడూ ధర్మమే జయిస్తుంది . అధర్మం జయించదు . “యతో ధర్మస్తతో జయః "( ధర్మమెక్కడో జయం  అక్కడ) అనేది భారతసందేశం.

“సత్యమేవ జయతే"అంటుంది ఆర్షవాణి. సత్యవ్రతం పాటించే వారు మహితాత్ములౌతారు. దీనికి గాంధీ మహాత్ముడే నిదర్శనం. మసిపూసి మారేడు కాయ చేసినట్టుగా కొందరు తమ స్వార్థంకోసం సత్యాన్ని దాచి పెట్టి, తాత్కాలిక విజయం సాధించినా అది శాశ్వతం కాదు

మనస్సులోని మాలిన్యాల వికృతరూపమే క్రోధం. కోపాన్ని జయించనిదే ఎంతటి తపస్సైనా పరిపూర్ణం కాదు. కోపస్వభావులుగా పురాణకథల్లో పేరుపడిన విశ్వామిత్రుడు, దుర్వాసుడు మొదలైనవారు చివరకు అవమానితులు కావటం, పశ్చాత్తాప పడటం జరిగింది. అందుకే క్షమాగుణం విజేతగా నిలుస్తుంది గానీ, కోపంమాత్రం విజయం సాధింపజాలదు.

భగవద్గీత - దైవీసంపత్తి,ఆసురీ సంపత్తి అని స్వభావాలను రెండు విధాలుగా వివరించింది.విష్ణుమూర్తి దైవీ సంపత్తికి ప్రతీక, అధర్మవర్తనులు ఆసురీ సంపత్తికి ప్రతీకలు. అందుకే ఏకాలంలోనైనా అసురులపై లోకత్రాతయైన విష్ణువే విజయం సాధిస్తాడు. లోక కంటకులైన అసురులు అపజయాన్నే పొందుతారు.

Thursday, October 29, 2015

वागिवादं अर्धसंबंधं परोक्षे  दारभूषणं
यत्र मित्रत्वमिच्छंति  तत्र त्रीणि नकारयेत

వాగ్వాదం అర్థసంబంధం పరోక్షే దారభాషణం 
యత్ర మిత్రత్వమిచ్ఛంతి తత్ర త్రీణి న కారయేత్.

ఎక్కడ స్నేహాన్ని కోరుకుంటున్నామో అక్కడ వాగ్వాదం , ఆర్థిక సంబంధం, మిత్రుని పరోక్షంలో అతని భార్యతో మాట్లాడటం అనే మూడూ చేయరాదు అని ఈ శ్లోకానికి అర్థం. 

కొందరు మానవులలో తమ మాట నెగ్గితీరాలన్న పంతం ఎక్కువగా ఉంటుంది. తాము మాట్లాడేది న్యాయం కాదని,సహేతుకమూ,తర్కసహమూ కాదని తెలిసినా వితండవాదం చేస్తారు. సత్యశోభితమూ, హిత కారకమూ అయిన మిత్రవాక్యాన్ని కూడా లెక్కచేయరు. ఈ ధోరణి మైత్రిని విచ్ఛిన్నం చేస్తుంది. 

“ప్రతి వాదన వెనుకా, ఒకరి అజ్ఞానం ఉంటుంది” అనే సూక్తిని విశ్వసించి ఆ అజ్ఞానం తమదే అయితే ఆ వాదనను మానుకోవాలి. 

ఆర్థికవ్యవహారాల్లో వ్యక్తులమధ్య వైరుధ్యం సర్వసాధారణం. “మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః” (తల్లికీ, కొడుకుకూ కూడా విరోధం తీసుకువచ్చే ధనమా, నీకు నమస్కారం) అన్నాడొక కవి. ఒక మిత్రునితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకుంటే ఏదో ఒక సన్నివేశంలో అభిప్రాయభేదాలు రావచ్చు. 

మిత్రుడు ఇంటిలో లేనప్పుడు అతని భార్యతో మాట్లాడటం ఎన్నో విమర్శలకు దారి తీస్తుంది. ఆ మిత్రునికి తన భార్యయందు, తన పరోక్షంలో ఆమెతో మాట్లాడిన తన మిత్రునియందు విశ్వాసం ఉన్నా , లోకం అనేక రీతుల దుష్ప్రచారం చేయవచ్చు. మిత్ర భేదానికి ఇదీ ఒక కారణం కావచ్చు. 

అయితే, స్నేహితులతో ఆర్థిక సంబంధం లేకుండా ఉండటం , అతని భార్యతో అవసరాన్నిబట్టి పరోక్షంగా మాట్లాడకుండా ఉండటం సర్వత్రా సాధ్యం కాదు.ఈ రెండు పనులూ చేయటం నేరమా? ఒక జీవితకాలంలో ఇవి చేయకుండాఉండటం సాధ్యమా?  అని ప్రశ్నించటం అసంబద్ధంకాదు. అవసరానికి ఆర్థిక సహాయం చేయని మిత్రుడెందుకు? నిజమే “అమూల్యమైన స్నేహం అల్పమైన ఆర్థిక విషయం కారణంగా నశించే అవకాశం ఉంది , జాగ్రత్త "అని ఆత్మీయంగా ఈ సూక్తి సూచిస్తోంది. అలాగే , “ఇంద్రియాలు బలమైనవి, మనస్సు చంచలమైనది కనుక పరస్త్రీలతో సంభాషణంలో అప్రమత్తుడవై ఉండాలి”అని చెపుతోంది.

Tuesday, October 27, 2015

ईर्षी  घृणी  नसंतुष्टः क्रोधनो  नित्यशंञ्कितः
परभाग्योपजीवी च षडेते नित्य दुःखिता

ఈర్షీ ఘృణీ నసంతుష్టః క్రోధనో నిత్యశఙ్కితః
పరభాగ్యోపజీవీ చ షడేతే నిత్య దుఃఖితా


అసూయ, అతిగా జాలిపడటం లేదా అసహ్యించుకోవటం, అసంతృప్తి, ముక్కోపి, నిత్యమూ శంకించటం, ఇతరుల భాగ్యం మీద జీవించటం అనే గుణాలు వున్నవారు ఎప్పుడూ  సుఖంగా జీవితం గడపలేరు

Friday, October 16, 2015

यद्दूरं यद्दुराराध्यं यच्च दूरे व्यवस्थितम् ।
तत्सर्वं तपसा साध्यं तपो हि दुरातिक्रमम्।।

యద్దూరం  యద్దూరారాధ్యం యచ్చ దూరే  వ్యవస్థితం
తత్సర్వం  తపసా సాధ్యం తపోహి  దురాతిక్రమం


దూరం, దూరమైన ఆరాధ్యం అంటే మెప్పించటానికి కష్టసాధ్యమైనది, దూరంగా వున్నది అంటే చేరుకోలేని లక్ష్యం, ఇలా అన్నీ తపస్సు వలన మనం సాధించగలుగుతాం. తపస్సు మాత్రమే దూరతిక్రమణం అంటే మనం చేరుకోలేని గమ్యాలను చేరుకునేలా చేస్తుంది.

Wednesday, October 14, 2015

''గోభిస్తుల్యం నపశ్యామి ధనంకించిదిహాచ్యుత''

''కోడి, మేక లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....

గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ, నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది. తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా..


  1. ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని,
    ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.

    అలా ఒకరోజు, రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.

    ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ, మూత్రంలోగానీ, పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.

    మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
    గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
  2. "మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది".
    • ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు (Oxygen ) ను వదిలే ఏకైక ప్రాణి.
    • విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
    • వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
    • ఆవునెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
      • కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
    • గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
    • గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
    • ఇళ్ళను, వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
    • ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
    • ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen ) ఉత్పత్తి అవుతుంది.
    • గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
  3. ''గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మము రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''. - గాంధీజీ.
  4. ''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది. దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''. - మహ్మద్ ప్రవక్త.
  5. ''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''. - ఏసుక్రీస్తు.
  6. ''గో క్షీరము గొప్పమందు. దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని. దాని మాంసము రోగకారకము''. - హజరత్ మహమ్మద్.
  7. ''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము. ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపు భూములు గొప్పగానుండును. గృహములు ఉన్నతి చెందును. నాగరికత పురోగమించును''. - బర్మార్డ్ మేక్ ఫెడన్.
  8. ''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''. - హకీల హజ్మల్ ఖాన్.
  9. ''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''. - తోహస్-వి-హింద్ బిజహరు.
"భిన్నత్వంలో ఏకత్వం" ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?

నువ్వు హిందువైనా, మస్లీమువైనా, క్రిస్టియన్వైనా  ఈ దేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.

ఈ  దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.

స్వేచ్ఛంటే.... ''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు, ఈ  నీ  దేశం మెచ్చేటట్టు బ్రతకడం''

''వందేగోమాతరం''

Sunday, October 11, 2015

किं स्विद्गुरुतरम भूमेः  किं सविदुच्चतरम च खात 
किं  स्वीच्चीघ्रतरं वायो किं स्विद्बहुतरम तृणात 

माता गुरुतरा भूमेः  खात पितोच्चतरस्तथा 
मनः शीघ्रतरा वाता चिंता बहुतेरी तृणात 

కిం స్విద్గురుతరం భూమేః  కిం స్విదుచ్చతరం చ ఖాత్ 
కిం స్విచ్చీఘ్రతరమ్ వాయో కిం స్విద్బహుతరం

ఇది యక్ష ప్రశ్నలు ఘట్టం లోనిది. యక్షుడు ధర్మరాజుని ఇలా అడిగాడు

భూమి కంటే గురువైనది/బరువైనది ఏది? ఆకాశం కంటే ఎత్తైనది ఏది?
వాయువు కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే ఎక్కువగా వ్యాపించేది ఏది?

దానికి ధర్మరాజు ఇలా జవాబిచ్చాడు
మాతా గురుతారా భూమే అంటే అమ్మ భూమి కంటే గురవైనది. 
ఆకాశం కంటే పితా అంటే తండ్రి ఉన్నతమైనవాడు. 
మనస్సు వాయువు కన్నా వేగవంతమైనది
చింత తృణీకరిస్తున్న కొలదీ పెరుగుతూ వుంటుంది. 

ఆయనకు తన మాతృమూర్తిపై గల ఆదరాభిమానాలను తెలియజేస్తూ చెప్పిన శ్రీ గరికిపాటి నరసింహారావుగారి పద్యం.

గుండెకు హాని కల్గిన నకుంఠితధైర్యము నూని గుండెలన్
నిండిన ప్రేమతోడ నవనీనవనీతముఁ బంచిపెట్టి కై
దండగ నిల్చినట్టి నిను దారుణమౌ చితిమీదఁ బెట్టి నీ
గుండెకు నిప్పువెట్టితిని కూడనిదయ్యును ధర్మమయ్యెడిన్.

తల్లి గుండెలకు నిప్పు పెట్ట కూడదని  తెలిసినా ధర్మం పేరు చెప్పి చితి పెట్టవలసి వచ్చింది అని పద్యరూపంలో ఆవేదన వ్యక్త పరుచుకున్నారు 

Wednesday, September 30, 2015

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబందుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్
విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే 

Monday, September 28, 2015

किं स्थैर्यमृषिभिः प्रोक्तं किं च धैर्यमुदाहृतम
स्नानं  च किं परं पिरोक्तम् दानं च किमि होच्यते

स्वधर्मे  स्थिरता स्थैर्यं धैर्यमिंद्रिय निग्रहः 
स्नानं मनोमलत्यागो दानं  वै भूत रक्षणं

కిం స్థైర్య మృషిభిః ప్రోక్తం కిం చ ధైర్యముదాహృతమ్
స్నానం చ కిం పరం ప్రోక్తం దానం చ కిమిహోచ్యతే

స్వధర్మే స్థిరతా  స్థైర్యం ధైర్యమిన్ద్రియనిగ్రహః
స్నానం మనోమలత్యాగో దానం వై భూతరక్షణం

ఇది మహాభారతం లోని యక్ష ప్రశ్నలు ఘట్టంలోనిది.  ఈ యక్షపశ్నలు అందరూ చదివి తెలుసుకుని ఆచరణలో పెట్టవలసినవి. ఎవరైనా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే ఆపవయ్యా యక్షపశ్నలు నువ్వూను  అంటాం. అక్కడ ప్రశ్న లలో ఏమీ తేడా లేదు కానీ వేసిన సందర్భంలో తేడా... తన నలుగురు తమ్ముల మృతదేహాలను ఎదురుగా పెట్టుకుని ప్రశ్నలకు  జవాబులు చెప్పగలగటం ఒక్క ధర్మరాజుకే చెల్లింది.  

యక్షుడు ఇలా అడిగాడు: 
స్థైర్యం అని మన ఋషులు దేనిని అంటారు? ధైర్యం అంటే ఏమిటి?  స్నానంలో ఉత్తమమైనదేది? దానానికి అర్ధం పరమార్ధం ఏమిటి?

ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు:
స్వధర్మ  స్థిరత్వం స్థైర్యం. ఏ విధమైన భయమూ, ప్రలోభాలకు  లొంగకుండా తన ధర్మాన్ని నిర్వర్తించడమే స్థైర్యం. ధైర్యం అంటే ఇంద్రయాలను  నిగ్రహించ గలగడమే ధైర్యం. ప్రపంచ విజేతలు కూడా తమ ఇంద్రియాలను నిగ్రహించలేరు. మనస్సులోని మలాన్ని  శుభ్రం చేసుకోవడమే ఉత్తమమైన స్నానం. దానం వై భూత రక్షణం. ఇది అన్నిటికన్నా అద్భుతమైన జవాబు అని నాకనిపిస్తుంది, ఎందుకంటే దానం అంటే తృణమో, ఫలమో ఇవ్వడం కాదు. దానం సమస్త జీవరాశి రక్షణ బాధ్యత తన పర భేదంలేకుండా చేపట్టడం. భారతీయులుగా పుట్టడం అదృష్టం, భారతీయత గర్వకారణం అని చెప్పడానికి  ఇటువంటి పురాణాలు చాలవా...
नीचाश्रयो न खलु कर्तव्य: कर्तव्यो महदाश्रय:।
पयोपि शौण्डिकीहस्ते वारुणीत्यभिधीयते ।।

నీచాశ్రయో న ఖలు కర్తవ్యః  కర్తవ్యో మహదాశ్రయః 
పయోపి శౌండకీహస్తే వారుణీత్యభిధీయతే 

The company of the great should be sought, not that of those with vices. For, (even) Milk in the hands of a liquor selling woman will be looked on as liquor.

నీచుల ఆశ్రయం, సహవాసం ఎప్పుడూ చేయకూడదు, మహదాశ్రయం అంటే మహానుభావుల ఆశ్రయం సాంగత్యం ఎల్లప్పుడూ కర్తవ్యం గా జీవించాలి. మద్యం విక్రయంచే ఆమె వద్ద పాలు వున్నా మద్యం గానే భావిస్తారు అలాగే నీచుల ఆశ్రయం లో ఎంత నిష్ఠగా వున్నా నీచునిగానే పరిగణిస్తారు.

Friday, September 25, 2015

निर्गुणस्य हतं रूपं दु:शीलस्य हतं कुलम्।
असिद्धस्य हता विद्या अभोगस्य हतं धनम् ।।

నిర్గుణస్య హతం  రూపం దుఃశీలస్య హతం  కులం
అసిద్ధస్య హతా విద్యా అభోగస్య హతం ధనం

ఈ సుభాషితము రకరకాల విషయాలు ఎలా ఎందుకు నశించిపోతాయో తెలియచేస్తుంది.
1. గుణం లేని రూపం
గుణహీనమైన రూపం ప్రాణం లేని శరీరంతో సమానం, అటువంటి శరీరం ఎంతో కాలం వుండదు.
2. దుశ్శీలస్య హతం కులం
చెరుకు తుద  వెన్నుపుట్టిన చెరుకు తీపెల్ల చెరచు  అన్నట్లు ఒక్క దుశ్శీలవంతుడి వలన అతని వంశం మొత్తం నాశనం అవుతుంది
3. అసిద్ధస్య హతా విద్యా
విద్య వలన మనకు అష్ఠసిద్ధులు లభిస్తాయి. విద్యకు పరమార్దం కైవల్యం మోక్షం. అటువంటి సిద్ధులు నేర్పలేని కైవల్యపదాని దారి చూపలేని విద్య నాశనం అయిపోతుంది మరచిపోతాము.
4. అభోగస్య ధనం
దాన ధర్మాలు చేయకుండా ఎటువంటి భోగమనుభవించకుండా దాచిపెట్టిన ధనం చివరకు దొంగలపాలు  అయి నశిస్తుంది.

Friday, September 18, 2015

गुणा: सर्वत्र पूज्यन्ते न महत्योऽपि सम्पद:।
पूर्णेन्दु किं तथा वन्द्यो निष्कलंको यथा कुश:  

గుణాః సర్వత్ర పూజ్యంతే న మహత్యో అపి సంపదః
పూర్ణేందు  కిం తధా వంద్యో నిష్కలంకో యథా కుశః

ఒక మనిషి యొక్క సద్గుణాలు ఎల్లప్పుడూ  పూజింపబడతాయి, అతని సరిసందలూ కీర్తి ప్రతిష్టలూ కాదు. పౌర్ణమి నాటి నిండు చంద్రుడి కన్నా అర్ధచంద్రారమైన నెలవంకే పవిత్రంగా పూజింపబడుతుంది. పరమేశ్వరుడి సిగలో పూవు గా మారుతుంది. పదహారు కళలతో నిండు చంద్రుడు అందంగా వున్నా, ఎక్కువ వెన్నెల వెదజల్లినా దానిలో కనిపించే మచ్చవలన అది అంతగా పూజనీయం కాదు. కానీ నెలవంక చిన్నదయినా తక్కువ కాంతినిచ్చినా మచ్చలేని ఆ నెలవంకే పూజనీయం. ఇక్కడ సుభాషితకారుడు మచ్చలతో నిండిన నిండు చంద్రుని వెలతురుని గుణహీనమైన సిరి సంపదలతోనూ,  ఏ మచ్చాలేని మొదటి నాలుగు రోజుల వరకూ వెలిగే పవిత్రమైన నెలవంకని సద్గుణ సంపదలోనూ పోల్చారు.

Thursday, September 17, 2015

गणाणाम् त्वा  गणपतिग्ं हवामहे 
कविं  कवीनां उपमश्रवस्तवम्
ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पत
आनः श्शृण्वन्नूतिभि सीद सादनम्

గణానామ్ త్వా గణపతిగ్‍ం హవామహే
కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్

గణాలలో నీవు గణపతివి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. హవిస్సులర్పిస్తున్నాను. కవులలో కవి వి (మహాభారతం రచించినవాడివి) అందరిలో పోల్చవలసిన  కీర్తిశ్రేష్ఠులలో కూడా నీవే శ్రేష్ఠుడవు. రాజులకు జ్యేష్ఠుడవు, బ్రాహ్మణులలో గొప్ప బ్రాహ్మణుడవు. వచ్చి సుఖాసనంలో కూర్చుని మా కోరికలు వినుము.

Tuesday, September 15, 2015

रेखामात्रमपि क्षूण्णादामनोर्वर्त्मनः परं
नवियतीयुः प्रजास्तस्य नियंतुर्नेमिवृत्तयः

రేఖామాత్రమపి క్షుణ్ణాదామనోర్వర్త్మనః పరం
న వ్యతీయుః ప్రజాస్తస్య నియంతు ర్నేమివృత్తయః

ఇది కాళిదాసు గారి రఘువంశంలోనిది. ఎలా అయితే నేర్పరి అయిన సారధి తనకు క్షుణ్ణంగా తెలిసిన మార్గంలో ప్రయాణిస్తున్నపుడు తన రధాన్ని రహదారి మీద గీతను కూడా దాటకుండా ఎలా నడుపుతాడో అలాగే ఆ దిలీప మహారాజు నియమించిన నియమాలు తన ప్రజలు అతిక్రమించకుండా నడుచుకునేవారు. అంటే ప్రజలందరికీ అన్ని నియమాలు చిరపరిచితము. ఒక రాజ్యం, రాజు యొక్క గొప్పతనం ఇంతకన్నా చెప్పటానికి మంచి ఉదాహరణ వుండదు అంటే అతిశయోక్తి కాదు.

Sunday, September 13, 2015

धर्मोपार्जित जिवितानां शास्त्रेषु झानेषु सदा रतानां
जितेंद्रियाणामतिथि प्रियाणां गृहेषु मोक्षः  पुरुषोत्तमानां.

ధర్మో పార్జిత జీవితానాం శాస్త్రేషు జ్ఞానేషు సదా రతానాం 
జితేంద్రియాణా మథితి ప్రియాణం గృహేషు మోక్షః పురుషోత్త మానాం

మోక్షం ఎటువంటివారికి వస్తుందో ఈ శ్లోకం చెప్తుంది:
ధర్మ మార్గమున జీవయాత్ర సాగిస్తూ, నిరంతరమూ జ్ఞానము,శాస్త్రములు అధ్యయనంచేస్తూ ఆనందించేవాడు, ఇంద్రియ లౌల్యానికి లొంగకుండా వాటిని తన వశంలో వుంచుకున్నవాడు, అతిథులకి అత్యంత ప్రియముతో  గౌరవ మర్యాదలు చేసేవాడు అయిన ఉత్తముడికి గృహస్తాశ్రమములో ఉన్నాకూడా మోక్షము లభిస్తుంది. మోక్షం సాధించాలంటే సన్యసించి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. స్వధర్మ  నిర్వహణతో మోక్షం లభిస్తుంది.

Thursday, September 10, 2015

पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम़्।
सन्त: परीक्ष्यान्यतरद्भजन्ते मूढ: परप्रत्ययनेयबुद्धि:॥

పురాణమిత్యేవ న సాధు సర్వం న చాపి కావ్యం నవమిత్యవధ్యం
సంతః పరీక్ష్యాన్యతరద్భజంతే మూఢః పరప్రత్య‍యనేయబుద్ధిః


పురాతనమైనది అయిన ప్రతిదీ మంచిది కాదు, ఆధునికంగా చెప్పిన పద్యాన్ని తోసిపారేయకూడదు. ఒక విషయం మంచా చెడా అనేది దాని ఆయుర్ధాయం మీద ఆధారపడదు. పురాతనాలన్నీ మంచివని గుడ్డిగా స్వీకరంచకూడదు నవీనాలన్నీ చెడ్డవని వదిలిపెట్టకూడదు. సంతః అంటే ఙానులు పరీక్ష్యాన్యతరద్భజంతే  అంటే చెప్పిన విషయం పాతదా  కొత్త దా అని కాకుండా మంచిదా చెడ్డ దా అని పరీక్షించి స్వీకరిస్తారు, మరి మూఢులు పర ప్రత్యయేన అంటే పరుల అభిప్రాయంతో సర్దుకుపోతారు. ఇక్కడ మూఢుడు సాధుసంతుల సాంగత్యంలో వుంటే మంచిగా వారి మూఢత్వం  మంచికేదారితీస్తుంది.

Tuesday, September 8, 2015

प्रजानामेव भुत्यर्ध्यं ताभ्यो बलिमग्रहीत।
सहस्र गुण मत्स्रुष्टुमादत्तेहि रसं रविः।।

ప్రజానామేవ భుత్యర్ధం స తాభ్యో బలిమగ్రహీత్
సహస్ర గుణ మత్స్రుష్టుమాదత్తేహి రసం రవిః

ప్రజావృద్ధి కార్యములకోసమే దిలీపుడు  ప్రజల వద్దనుండి బలిమగ్రహీత్  అంటే పన్ను (1/6 వంతు) వసూలు చేసేవాడు. సూర్యుడు తిరిగి వేయిరెట్లుగా వర్షించటానికే కదా నదీ సాగరాలనుంచి రసం అంటే నీటిని ఆవిరి గా మార్చి గ్రహించేది.

ఇది మహాకవి కాళిదాసు రఘు వంశం కావ్యం లోనిది. ఇక్కడ రాజు పన్ను ఎంత వసూలు చేయాలో కూడా చెప్పారు. మన నిత్యజీవితంలో అవసరాలకు కమ్మరి కుమ్మరి చాకలి వడ్రంగి మొదలైన వారితో అక్కడే క్రయవిక్రయాలు నిర్వహణ జరిగిపోతుంది. బ్రాహ్మణులు, సైనికులు  వారి అవసరాలకు క్రయవిక్రయాలు చేయలేరు చేయకూడదు. అటువంటి వారి సుఖసంతోషాలు  రాజు బాధ్యత. అదే కాక రాహదారుల నిర్వహణ మొదలైన అంశాలన్నీ ఈ పన్నులోనుంచే వినియోగించాలి. ఇప్పటి పన్ను విధానాలు మారిపోయాయి తమ జేబులు నింపుకోవటం కోసం పన్ను వసూలు ధర్మ మార్గం కాదు.

Monday, September 7, 2015

वित्तेन रक्ष्यते धर्मो विद्या योगेन रक्ष्यते
मृदुना रक्ष्यते भूपः सत्स्त्रिया रक्ष्यते गृहम्

విత్తేన రక్ష్యతే  ధర్మో విద్యా యోగేన రక్ష్యతే
మృదూనా రక్ష్యతే భూపః సస్త్రీయా  రక్ష్యతే గృహమ్

విత్తం అంటే ధనం. ధనం వలన ధర్మం రక్షించ బడుతుంది, అంటే ధనం లేని చోట ధర్మం రక్షణ జరగదు. ఆ ధర్మ రక్షణార్ధమే ప్రభుత్వము పన్ను వసూలు చేయాలి. యోగము అంటే ధ్యానము, కేవలం ధ్యానము వలనే మనకు లభించిన ఙానం  రక్షింపబడుతుంది, లేకపోతే కాలగమనంలో మరచి తిరిగి అఙానాంధకారంలోకి వెళ్ళి పోతాము. రాజు తన మృదుత్వం వలన ప్రజలకు చేరువయి రక్షించబడతాడు. చివరగా సస్త్రీ అంటే మంచి ఇల్లాలి వలన ఇల్లు రక్షింపబడుతుంది.

Sunday, September 6, 2015

युक्तियुक्तम् वचो ग्राह्यं बलादपि शुकदापी | 
युक्तिहीनम् वचस्त्याज्यं वृद्धादपि शुकादपि ||

యుక్తియుక్తం వచో గ్రాహ్యం బాలాదపి శుకాదపి |
యుక్తిహీనం వచస్త్యాజ్య వృద్ధాదపి శుకాదపి ||

సరియైన విషయ జ్ఞానం ఎవరు చెప్పినా స్వీకరించాలి, వయసులో చిన్నవారైన, చివరకు చిలుక అయినా.  కాని హీనమైన విషయాన్ని తప్పక త్యజించాలి, అది వయసులో పెద్దవారైనా లేక శుక మహర్షి లాంటి వారు చెప్పినా. 

दरिद्राय कृतं दानं  शून्य लिंगस्य पूजनं
अनाथ प्रेत संस्कारं  अश्वमैध समं विधुः

దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .

బీదవానికి దానము చేయుట, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమును దహనము చేయుట, యీ మూడున్ను అశ్వమేధముతో సమమైన ఫలమునిస్తుంది....

Saturday, September 5, 2015

धर्मोपार्जित जिवितानां शास्त्रेषु झानेषु सदा रतानां
जितेंद्रियाणामतिथि प्रियाणां गृहेषु मोक्षः  पुरुषोत्तमानां.

ధర్మో పార్జిత జీవితానాం 
శాస్త్రేషు జ్ఞానేషు సదా రతానాం 
జితేంద్రియాణా మథితి ప్రియాణం 
గృహేషు మోక్షః పురుషోత్త మానాం

మోక్షం ఎటువంటివారికి వస్తుందో ఈ శ్లోకం చెప్తుంది.
ధర్మ మార్గమున జీవయాత్ర సాగిస్తూ, నిరంతరమూ జ్ఞానము,శాస్త్రములు అధ్యయనంచేస్తూ ఆనందించేవాడు, ఇంద్రియ లౌల్యానికి లొంగకుండా వాటిని తన వశంలో వుంచుకున్నవాడు, అతిథులకి అత్యంత ప్రియముతో  గౌరవ మర్యాదలు చేసేవాడు అయిన ఉత్తముడికి గృహస్తాశ్రమములో ఉన్నాకూడా మోక్షము లభిస్తుంది. మోక్షం సాధించాలంటే సన్యసించి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. స్వధర్మ  నిర్వహణతో మోక్షం లభిస్తుంది.

Thursday, September 3, 2015

उदये सविता रक्तो रक्तश्चास्तमये तथा।
सम्पत्तौ च विपत्तौ च महतामेकरूपता।।

 ఉదయే సవితా రక్తౌ రక్తశ్చాస్తమయే తథా।
సంపత్తౌ చ విపత్తౌ చ మహాత్మేకరూపతా।।

ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో భానుడు ఒకే విధంగా కనపడినట్లు, మహాత్ములు సుఖ మరియు దుఃఖ సమయాలలో ఒకే విధంగా ప్రవర్తిస్తారు.

Wednesday, September 2, 2015

इंद्रियीर्धाननुभवन् बुद्धिमान लोकपूजितः
सम्मतः  सर्वभूतानामुच्छस्वन् को न जीवति

देवतातिथिभृत्यानां पितृणामात्मनश्चयः
न निर्वपति  पंचानामुच्छस्वन् न सजीवति

ఇంద్రియార్ధాననుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః
సమ్మతః  సర్వభూతానాంముచ్ఛ్వసన్ కో న జీవతి

దేవతాతిథిభృత్యానాం  పిత్రూణామాత్మనశ్చ యః
న నిర్వపతి పంచానాముచ్ఛ్వసన్ న స జీవతి


ఇది మహాభారతంలో యక్ష ప్రశ్నలు ఘట్టం లోనిది. యక్షుడు ధర్మరాజుని ఇలా అడిగాడు
ఎవరు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ, బుద్ధిమంతుడు, లోక పూజితిడు సర్వభూతాలకూ సమ్మతమైన వాడూ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు  సాగిస్తున్నా జీవచ్ఛవంతో సమానము??
దానికి ధర్మజుడు  ఇలా అన్నాడు
ఎవరైతే దేవతలకు, అతిథులకు, భృత్యులకు  అంటే పనివారు, పితృదేవతలకు  చివరగా ఆత్మనః అంటే స్వార్ధం ఈ అయిదుగురికీ తగినట్లుగా ఉపచారాలు చేయడో వారి బాగోగులు చూసుకోడో వాడు బ్రతికివున్నా మరణించినట్లు...
పరివర్తని సంసారే
మృతఃకోవానజాయతే
స జాతోయేన జాతేన
యాతి వంశస్సమున్నతిమ్

నిత్యమూ పరివర్తన చెందే ఈ జగత్తులో గిట్టినవారంతా ఒకనాడుపుట్టిన వారే కదా! ఎవడి పుట్టుక వల్ల వంశప్రతిష్టపెరుగుతుందో.,
అలాంటి వాడే పుట్టినట్టు లెక్క!