वागिवादं अर्धसंबंधं परोक्षे दारभूषणं
यत्र मित्रत्वमिच्छंति तत्र त्रीणि नकारयेत
వాగ్వాదం అర్థసంబంధం పరోక్షే దారభాషణం
యత్ర మిత్రత్వమిచ్ఛంతి తత్ర త్రీణి న కారయేత్.
ఎక్కడ స్నేహాన్ని కోరుకుంటున్నామో అక్కడ వాగ్వాదం , ఆర్థిక సంబంధం, మిత్రుని పరోక్షంలో అతని భార్యతో మాట్లాడటం అనే మూడూ చేయరాదు అని ఈ శ్లోకానికి అర్థం.
కొందరు మానవులలో తమ మాట నెగ్గితీరాలన్న పంతం ఎక్కువగా ఉంటుంది. తాము మాట్లాడేది న్యాయం కాదని,సహేతుకమూ,తర్కసహమూ కాదని తెలిసినా వితండవాదం చేస్తారు. సత్యశోభితమూ, హిత కారకమూ అయిన మిత్రవాక్యాన్ని కూడా లెక్కచేయరు. ఈ ధోరణి మైత్రిని విచ్ఛిన్నం చేస్తుంది.
“ప్రతి వాదన వెనుకా, ఒకరి అజ్ఞానం ఉంటుంది” అనే సూక్తిని విశ్వసించి ఆ అజ్ఞానం తమదే అయితే ఆ వాదనను మానుకోవాలి.
ఆర్థికవ్యవహారాల్లో వ్యక్తులమధ్య వైరుధ్యం సర్వసాధారణం. “మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః” (తల్లికీ, కొడుకుకూ కూడా విరోధం తీసుకువచ్చే ధనమా, నీకు నమస్కారం) అన్నాడొక కవి. ఒక మిత్రునితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకుంటే ఏదో ఒక సన్నివేశంలో అభిప్రాయభేదాలు రావచ్చు.
మిత్రుడు ఇంటిలో లేనప్పుడు అతని భార్యతో మాట్లాడటం ఎన్నో విమర్శలకు దారి తీస్తుంది. ఆ మిత్రునికి తన భార్యయందు, తన పరోక్షంలో ఆమెతో మాట్లాడిన తన మిత్రునియందు విశ్వాసం ఉన్నా , లోకం అనేక రీతుల దుష్ప్రచారం చేయవచ్చు. మిత్ర భేదానికి ఇదీ ఒక కారణం కావచ్చు.
అయితే, స్నేహితులతో ఆర్థిక సంబంధం లేకుండా ఉండటం , అతని భార్యతో అవసరాన్నిబట్టి పరోక్షంగా మాట్లాడకుండా ఉండటం సర్వత్రా సాధ్యం కాదు.ఈ రెండు పనులూ చేయటం నేరమా? ఒక జీవితకాలంలో ఇవి చేయకుండాఉండటం సాధ్యమా? అని ప్రశ్నించటం అసంబద్ధంకాదు. అవసరానికి ఆర్థిక సహాయం చేయని మిత్రుడెందుకు? నిజమే “అమూల్యమైన స్నేహం అల్పమైన ఆర్థిక విషయం కారణంగా నశించే అవకాశం ఉంది , జాగ్రత్త "అని ఆత్మీయంగా ఈ సూక్తి సూచిస్తోంది. అలాగే , “ఇంద్రియాలు బలమైనవి, మనస్సు చంచలమైనది కనుక పరస్త్రీలతో సంభాషణంలో అప్రమత్తుడవై ఉండాలి”అని చెపుతోంది.

No comments:
Post a Comment