Thursday, October 29, 2015

वागिवादं अर्धसंबंधं परोक्षे  दारभूषणं
यत्र मित्रत्वमिच्छंति  तत्र त्रीणि नकारयेत

వాగ్వాదం అర్థసంబంధం పరోక్షే దారభాషణం 
యత్ర మిత్రత్వమిచ్ఛంతి తత్ర త్రీణి న కారయేత్.

ఎక్కడ స్నేహాన్ని కోరుకుంటున్నామో అక్కడ వాగ్వాదం , ఆర్థిక సంబంధం, మిత్రుని పరోక్షంలో అతని భార్యతో మాట్లాడటం అనే మూడూ చేయరాదు అని ఈ శ్లోకానికి అర్థం. 

కొందరు మానవులలో తమ మాట నెగ్గితీరాలన్న పంతం ఎక్కువగా ఉంటుంది. తాము మాట్లాడేది న్యాయం కాదని,సహేతుకమూ,తర్కసహమూ కాదని తెలిసినా వితండవాదం చేస్తారు. సత్యశోభితమూ, హిత కారకమూ అయిన మిత్రవాక్యాన్ని కూడా లెక్కచేయరు. ఈ ధోరణి మైత్రిని విచ్ఛిన్నం చేస్తుంది. 

“ప్రతి వాదన వెనుకా, ఒకరి అజ్ఞానం ఉంటుంది” అనే సూక్తిని విశ్వసించి ఆ అజ్ఞానం తమదే అయితే ఆ వాదనను మానుకోవాలి. 

ఆర్థికవ్యవహారాల్లో వ్యక్తులమధ్య వైరుధ్యం సర్వసాధారణం. “మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః” (తల్లికీ, కొడుకుకూ కూడా విరోధం తీసుకువచ్చే ధనమా, నీకు నమస్కారం) అన్నాడొక కవి. ఒక మిత్రునితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకుంటే ఏదో ఒక సన్నివేశంలో అభిప్రాయభేదాలు రావచ్చు. 

మిత్రుడు ఇంటిలో లేనప్పుడు అతని భార్యతో మాట్లాడటం ఎన్నో విమర్శలకు దారి తీస్తుంది. ఆ మిత్రునికి తన భార్యయందు, తన పరోక్షంలో ఆమెతో మాట్లాడిన తన మిత్రునియందు విశ్వాసం ఉన్నా , లోకం అనేక రీతుల దుష్ప్రచారం చేయవచ్చు. మిత్ర భేదానికి ఇదీ ఒక కారణం కావచ్చు. 

అయితే, స్నేహితులతో ఆర్థిక సంబంధం లేకుండా ఉండటం , అతని భార్యతో అవసరాన్నిబట్టి పరోక్షంగా మాట్లాడకుండా ఉండటం సర్వత్రా సాధ్యం కాదు.ఈ రెండు పనులూ చేయటం నేరమా? ఒక జీవితకాలంలో ఇవి చేయకుండాఉండటం సాధ్యమా?  అని ప్రశ్నించటం అసంబద్ధంకాదు. అవసరానికి ఆర్థిక సహాయం చేయని మిత్రుడెందుకు? నిజమే “అమూల్యమైన స్నేహం అల్పమైన ఆర్థిక విషయం కారణంగా నశించే అవకాశం ఉంది , జాగ్రత్త "అని ఆత్మీయంగా ఈ సూక్తి సూచిస్తోంది. అలాగే , “ఇంద్రియాలు బలమైనవి, మనస్సు చంచలమైనది కనుక పరస్త్రీలతో సంభాషణంలో అప్రమత్తుడవై ఉండాలి”అని చెపుతోంది.

Tuesday, October 27, 2015

ईर्षी  घृणी  नसंतुष्टः क्रोधनो  नित्यशंञ्कितः
परभाग्योपजीवी च षडेते नित्य दुःखिता

ఈర్షీ ఘృణీ నసంతుష్టః క్రోధనో నిత్యశఙ్కితః
పరభాగ్యోపజీవీ చ షడేతే నిత్య దుఃఖితా


అసూయ, అతిగా జాలిపడటం లేదా అసహ్యించుకోవటం, అసంతృప్తి, ముక్కోపి, నిత్యమూ శంకించటం, ఇతరుల భాగ్యం మీద జీవించటం అనే గుణాలు వున్నవారు ఎప్పుడూ  సుఖంగా జీవితం గడపలేరు

Friday, October 16, 2015

यद्दूरं यद्दुराराध्यं यच्च दूरे व्यवस्थितम् ।
तत्सर्वं तपसा साध्यं तपो हि दुरातिक्रमम्।।

యద్దూరం  యద్దూరారాధ్యం యచ్చ దూరే  వ్యవస్థితం
తత్సర్వం  తపసా సాధ్యం తపోహి  దురాతిక్రమం


దూరం, దూరమైన ఆరాధ్యం అంటే మెప్పించటానికి కష్టసాధ్యమైనది, దూరంగా వున్నది అంటే చేరుకోలేని లక్ష్యం, ఇలా అన్నీ తపస్సు వలన మనం సాధించగలుగుతాం. తపస్సు మాత్రమే దూరతిక్రమణం అంటే మనం చేరుకోలేని గమ్యాలను చేరుకునేలా చేస్తుంది.

Wednesday, October 14, 2015

''గోభిస్తుల్యం నపశ్యామి ధనంకించిదిహాచ్యుత''

''కోడి, మేక లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....

గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ, నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది. తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.

నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా..


  1. ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని,
    ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.

    అలా ఒకరోజు, రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.

    ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ, మూత్రంలోగానీ, పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.

    మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
    గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
  2. "మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది".
    • ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు (Oxygen ) ను వదిలే ఏకైక ప్రాణి.
    • విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
    • వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
    • ఆవునెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
      • కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
    • గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
    • గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
    • ఇళ్ళను, వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
    • ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
    • ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen ) ఉత్పత్తి అవుతుంది.
    • గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
  3. ''గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మము రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''. - గాంధీజీ.
  4. ''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది. దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''. - మహ్మద్ ప్రవక్త.
  5. ''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''. - ఏసుక్రీస్తు.
  6. ''గో క్షీరము గొప్పమందు. దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని. దాని మాంసము రోగకారకము''. - హజరత్ మహమ్మద్.
  7. ''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము. ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపు భూములు గొప్పగానుండును. గృహములు ఉన్నతి చెందును. నాగరికత పురోగమించును''. - బర్మార్డ్ మేక్ ఫెడన్.
  8. ''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''. - హకీల హజ్మల్ ఖాన్.
  9. ''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''. - తోహస్-వి-హింద్ బిజహరు.
"భిన్నత్వంలో ఏకత్వం" ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?

నువ్వు హిందువైనా, మస్లీమువైనా, క్రిస్టియన్వైనా  ఈ దేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.

ఈ  దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.

స్వేచ్ఛంటే.... ''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు, ఈ  నీ  దేశం మెచ్చేటట్టు బ్రతకడం''

''వందేగోమాతరం''

Sunday, October 11, 2015

किं स्विद्गुरुतरम भूमेः  किं सविदुच्चतरम च खात 
किं  स्वीच्चीघ्रतरं वायो किं स्विद्बहुतरम तृणात 

माता गुरुतरा भूमेः  खात पितोच्चतरस्तथा 
मनः शीघ्रतरा वाता चिंता बहुतेरी तृणात 

కిం స్విద్గురుతరం భూమేః  కిం స్విదుచ్చతరం చ ఖాత్ 
కిం స్విచ్చీఘ్రతరమ్ వాయో కిం స్విద్బహుతరం

ఇది యక్ష ప్రశ్నలు ఘట్టం లోనిది. యక్షుడు ధర్మరాజుని ఇలా అడిగాడు

భూమి కంటే గురువైనది/బరువైనది ఏది? ఆకాశం కంటే ఎత్తైనది ఏది?
వాయువు కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే ఎక్కువగా వ్యాపించేది ఏది?

దానికి ధర్మరాజు ఇలా జవాబిచ్చాడు
మాతా గురుతారా భూమే అంటే అమ్మ భూమి కంటే గురవైనది. 
ఆకాశం కంటే పితా అంటే తండ్రి ఉన్నతమైనవాడు. 
మనస్సు వాయువు కన్నా వేగవంతమైనది
చింత తృణీకరిస్తున్న కొలదీ పెరుగుతూ వుంటుంది. 

ఆయనకు తన మాతృమూర్తిపై గల ఆదరాభిమానాలను తెలియజేస్తూ చెప్పిన శ్రీ గరికిపాటి నరసింహారావుగారి పద్యం.

గుండెకు హాని కల్గిన నకుంఠితధైర్యము నూని గుండెలన్
నిండిన ప్రేమతోడ నవనీనవనీతముఁ బంచిపెట్టి కై
దండగ నిల్చినట్టి నిను దారుణమౌ చితిమీదఁ బెట్టి నీ
గుండెకు నిప్పువెట్టితిని కూడనిదయ్యును ధర్మమయ్యెడిన్.

తల్లి గుండెలకు నిప్పు పెట్ట కూడదని  తెలిసినా ధర్మం పేరు చెప్పి చితి పెట్టవలసి వచ్చింది అని పద్యరూపంలో ఆవేదన వ్యక్త పరుచుకున్నారు