किं स्विद्गुरुतरम भूमेः किं सविदुच्चतरम च खात
किं स्वीच्चीघ्रतरं वायो किं स्विद्बहुतरम तृणात
माता गुरुतरा भूमेः खात पितोच्चतरस्तथा
मनः शीघ्रतरा वाता चिंता बहुतेरी तृणात
కిం స్విద్గురుతరం భూమేః కిం స్విదుచ్చతరం చ ఖాత్
కిం స్విచ్చీఘ్రతరమ్ వాయో కిం స్విద్బహుతరం
ఇది యక్ష ప్రశ్నలు ఘట్టం లోనిది. యక్షుడు ధర్మరాజుని ఇలా అడిగాడు
భూమి కంటే గురువైనది/బరువైనది ఏది? ఆకాశం కంటే ఎత్తైనది ఏది?
వాయువు కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే ఎక్కువగా వ్యాపించేది ఏది?
దానికి ధర్మరాజు ఇలా జవాబిచ్చాడు
మాతా గురుతారా భూమే అంటే అమ్మ భూమి కంటే గురవైనది.
ఆకాశం కంటే పితా అంటే తండ్రి ఉన్నతమైనవాడు.
మనస్సు వాయువు కన్నా వేగవంతమైనది
చింత తృణీకరిస్తున్న కొలదీ పెరుగుతూ వుంటుంది.
ఆయనకు తన మాతృమూర్తిపై గల ఆదరాభిమానాలను తెలియజేస్తూ చెప్పిన శ్రీ గరికిపాటి నరసింహారావుగారి పద్యం.
గుండెకు హాని కల్గిన నకుంఠితధైర్యము నూని గుండెలన్
నిండిన ప్రేమతోడ నవనీనవనీతముఁ బంచిపెట్టి కై
దండగ నిల్చినట్టి నిను దారుణమౌ చితిమీదఁ బెట్టి నీ
గుండెకు నిప్పువెట్టితిని కూడనిదయ్యును ధర్మమయ్యెడిన్.
తల్లి గుండెలకు నిప్పు పెట్ట కూడదని తెలిసినా ధర్మం పేరు చెప్పి చితి పెట్టవలసి వచ్చింది అని పద్యరూపంలో ఆవేదన వ్యక్త పరుచుకున్నారు

No comments:
Post a Comment