Tuesday, September 18, 2018
Monday, September 10, 2018
క్షంతవ్యో మందబుద్ధీనా
क्षन्तव्यो मन्दबुद्धीनामपराधो मनीषिणा
न हि सर्वत्र पाण्डित्यं सुलभं पुरुषे क्वचित्
క్షంతవ్యో మందబుద్ధీనామపరాధో మనీషిణా
న హి సర్వత్ర పాండిత్యం సులభం పురుషే క్వచిత్
మంద బుద్ధిగలవాని అపరాధాలు క్షమార్హాలు. అందరికీ పాండిత్యం, వాగ్ధాటి లాంటివి సంపాదించడం అన్నది అంత సులభం కాదు.
అటువంటి సంపదను పొందడానికి కొంత పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు లేదా భగవత్ ప్రసాదంగా భావించాలి. అందువలన పండితులకు అకారణ గర్వం పనికిరాదు, పాండిత్యం లేని వారిని చిన్నచూపు చూడకూడదు. అవివేకి ఒక జ్ఞాని యొక్క సమాధానం నుండి నేర్చుకొనే దాని కన్నా ఎన్నో రెట్లు, ఒక తెలివైన వాడు, అజ్ఞాని యొక్క మూర్ఖపు ప్రశ్నల నుంచి ఎంతో నేర్చుకోగలడు.
Thursday, April 19, 2018
Subscribe to:
Posts (Atom)